లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తాం !

Telugu Lo Computer
0


లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. లోక్ సభలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ తేల్చాలి అని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కమ్యునిస్టులతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సుముఖంగా ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పట్ల బీఆర్ఎస్ శతృపూరిక వైఖరి అవలంభిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ అవినీతి సొమ్మును కక్కించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని తమ్మినేని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేసినప్పటికీ.. ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు.. కేంద్రంలో వామపక్షాలు కాంగ్రెస్‌కు మద్ధతు ఇస్తున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)