స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ చివరకు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 72,220.57 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72,099 - 72,730 మధ్య చలించిన సూచీ.. చివరికి 195.42 పాయింట్ల లాభంతో 72,500.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.65 పాయింట్ల లాభంతో 21,982.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు రాణించాయి. టాటా మోటార్స్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 82.91గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 83.37 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు ధర 2042 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)