డాలీ చాయ్‌వాలా చాయ్‌ను ఆస్వాదించిన బిల్‌గేట్స్‌ !

Telugu Lo Computer
0


మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సందర్శించిన ఆయన భారత్‌లోని వివిధ ప్రాంతాలనూ సందర్శిస్తున్నారు. స్థానిక సంస్కృతిని తెలుసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా సోషల్‌మీడియాలో ఫేమస్‌ అయిన డాలీ చాయ్‌వాలా వద్దకు వెళ్లి చాయ్‌ను టేస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయనే స్వయంగా పంచుకున్నారు. 'భారత్‌లో ఎక్కడ చూసినా ఆవిష్కరణలు కనిపిస్తాయి. సాధారణంగా తయారుచేసే టీలో కూడా' అంటూ గేట్స్‌ తన వీడియోలో పేర్కొన్నారు. 'వన్‌ చాయ్‌ ప్లీజ్‌' అని టీని ఆర్డర్‌ చేయడంతో వీడియో మొదలవుతుంది. డాలీ చాయ్‌వాలా తనదైన శైలిలో బండి మీద టీని సిద్ధం చేస్తుంటే ఆసక్తిగా తిలకించారు. ఆ వ్యక్తి చేసిన టీని తాగుతూ.. మరొకొన్ని ''చాయ్‌ పే చర్చా'' కోసం ఎదురుచూస్తున్నా అనడంతో వీడియో ముగిసింది. డాలీ చాయ్‌వాలా పనితీరును చూసిన బిల్‌గేట్స్‌ అద్భుతమైన ఆవిష్కర్తలకు భారత్‌ నిలయం అని అభివర్ణించారు. సాధారణంగా కప్పు టీని తయారుచేయడాన్నీ ఓ కళారూపంగా మార్చారన్నారు. గేట్స్‌ పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. 'ఇంతకీ బిల్లెంత సర్‌' అంటూ ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఇండియా కామెంట్ పెట్టగా 'భూ ప్రపంచంలోనే అదృష్టవంతుడు' అంటూ డాలీని ఉద్దేశించి ఓ ఫుడ్‌ బ్లాగర్‌ కామెంట్‌ చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)