హైదరాబాద్ చేరిన జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు !

Telugu Lo Computer
0


జార్ఖండ్‌ నుంచి జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో దిగిన ఎమ్మెల్యేలను మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి తదితర కాంగ్రెస్ నేతలు దగ్గరుండి నేరుగా శామీర్పేట్ రిసార్ట్ కు తరలించారు. అంతకుముందు రెండు ఫ్లైట్స్ లో 43 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ మనీ లాండరింగ్‌ కేసులో రెండు రోజుల క్రితం అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమంత్‌ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో జేఎంఎం ఉపాధ్యక్షుడు, ఆ రాష్ట్ర మంత్రి చంపాయ్‌ సోరెన్‌ శుక్రవారం జార్ఖండ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 10 రోజులలోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఆయనకు గవర్నర్‌ ఆదేశించారు. ఈ క్రమంలో ఇండియా కూటమికి చెందిన జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)