గిన్నీస్ రికార్డు సృష్టించిన భవైక్యతా సంస్థాన్ !

Telugu Lo Computer
0


ర్ణాటక లోని శిరహట్టికి చెందిన భవైక్యతా సంస్థాన్ మహాపీఠం కనీవినీ ఎరుగని రీతిలో తులాభారాన్ని నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. హుబ్బళ్లిలోని నెహ్రూ స్టేడియంలో గురువారం జ్ఞాని ఫకీర్ సిద్ధరామ మహా స్వామీజీ , చంపిక ఏనుగుల తులాభారాన్ని ఒకేసారి పూర్తి చేసింది. ఫకీర్ సిద్ధారామ్ 75వ జన్మ దినోత్సవంతో పాటు, ఆయన చంపిక మఠంలో చేరి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ తులాభారాన్ని నిర్వహించారు. మఠానికి చెందిన ఏనుగుతో పాటు, ఫకీర్ స్వామీజీకి బరువుకు సరిపడే 10 రూపాయల నాణాలతో ఈ తులాభారాన్ని పూర్తి చేశారు. మొత్తం 5,555 కేజీల బరువుకు సమానమైన 10 రూపాయల నాణాలను ఈ తులాభారంలో వినియోగించారు. 10 రూపాయల నాణాలతో నిండిన మొత్తం 376 బస్తాలను ఉపయోగించారు. వీటి విలువ రూ.73.40 లక్షలు. ఈ మొత్తం నాణాలను ప్రత్యేకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెప్పించారు. ఇంత భారీ స్థాయిలో ఎక్కడా తులాభారం జరగలేదని, అందుకే ఈ తులాభారం గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించిందని మఠం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మంత్రులు హెచ్‌కే పాటిల్, ఎమ్‌బీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజు బొమ్మై, జగదీష్ షెట్టర్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)