మేడారం జాతరలో ఎస్సైని చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ గౌస్ !

Telugu Lo Computer
0


మేడారం జాతరలో తన కుటుంబసభ్యులతో కలిసి సమ్మక్క దర్శనానికి వెళ్తున్న ఏఆర్ ఎస్సై రవికుమార్ ను అతని కుటుంబ సభ్యుల ముందే ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌస్ శుక్ర వారం రాత్రి చెంప దెబ్బ కొట్టారు. వరంగల్ కమిషనరేట్ కు చెందిన రవికుమార్ ప్రస్తుతం మేడారం జాతరలో రోప్ పార్టీ ఇన్​చార్జ్​గా డ్యూటీలో ఉన్నారు. శుక్ర వారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లారు. క్యూ లైన్​లోకి తన భార్య, పిల్లలను పంపించే ప్రయత్నం చేశారు.  ఇది గమనించిన ఎస్పీ ఆలం గౌస్ర, వికుమార్ చెంప మీద కొట్టారు. ఈ హఠాత్పరిణామంతో ఎస్సై బిత్తర పోగా, ఎస్పీ బూతుపురాణం అందుకు న్నారు. ఇది చూసిన ఎస్సై కుటుంబ సభ్యు లు కన్నీటి పర్యంతమ య్యారు. పనిష్మెంట్ కింద కుటుంబ సభ్యుల ముందే రవి కుమార్​ను కింద కూర్చోబెట్టారు. కొందరు సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు శాంతింపజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)