కోతులను తరిమెందుకు వినూత్న ప్రయోగం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో గత కొంతకాలంగా కోతులు బెడదతో కంటిమీద కునుకు లేకుండా పోతుంది. వందల సంఖ్యలో ఉన్న కోతుల సమూహాలు ఏకంగా గుంపులుగా వచ్చి జనావాసాల్లో తిరుగుతూ కంటికి కనిపించిన వస్తువును నాశనం చేస్తున్నాయి. ఇళ్ల పైకప్పులను కూడా ధ్వంసం చేస్తున్నాయి. వాటిని తరిమెందుకు ప్రయత్నించిన ఎంతోమందిని గాయపరిచాయి. దీంతో ఏదైనా చర్యలు చేపట్టాలి అంటూ స్థానికులు మున్సిపల్ అధికారులను కోరగా,  అధికారులు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. కోతులకు ఎలాంటి హాని చేయకుండా అటవీ ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలనుకున్నారు. ఇద్దరు వ్యక్తులకు ఎలుగుబంటి వేషధారణ వేసి కోతలు ఎక్కువగా సంచరించే జనావాస ప్రాంతాల్లో వాటిని ఉంచారు. అయితే ఎలుగుబంటి వేసేదరణలో ఉన్న వ్యక్తులను చూసి వాటికి హాని చేయడానికి చూస్తున్నారని భయంతో కోతులు అక్కడి నుంచి పరుగులు తీస్తున్నాయి. ఈ ఆలోచన వర్కౌట్ కావడంతో కోతుల బెడద ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇదే రిపీట్ చేస్తున్నారు అధికారులు.

Post a Comment

0Comments

Post a Comment (0)