జూలై ఒకటి నుంచి కొత్త న్యాయ చట్టాలు అమలు ?

Telugu Lo Computer
0


భారతీయ శిక్ష్మా స్మృతి(ఐపీసీ) స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ కొత్త న్యాయ చట్టాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ న్యాయ స్మృతులకు చెందిన బిల్లులు కూడా ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందాయి. జూలై ఒకటో తేదీ నుంచి ఆ కొత్త న్యాయ చట్టాలు అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌తో పాటు బ్రిటిష్‌ హయాం నాటి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ లను కూడా కేంద్రం ఇటీవల రద్దు చేసింది. వాటి స్థానంలో కూడా కొత్త బిల్లులను రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో ది భారతీయ న్యాయ సంహిత - 2023 బిల్లును తీసుకొచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్‌ కోడ్‌ స్థానంలో కొత్త చట్టం కోసం 'ది భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత - 2023' బిల్లును, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో కొత్త చట్టం కోసం 'ది భారతీయ సాక్ష్య బిల్లు - 2023'ను రూపొందించింది. ఈ మూడు బిల్లులను హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ మూడు బిల్లులకు పార్లమెంట్‌ లో ఆమోదం లభించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)