పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకానికి కేంద్రం ఆమోదం !

Telugu Lo Computer
0


'పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ పథకం ద్వారా కోటి కుటుంబాలకు రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేసేందుకు రూ. 78,000 సహాయం అందించనున్నట్లు తెలిపారు. దీంతో నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను పొందవచ్చని అన్నారు. రూ.75,021 కోట్ల వ్యయంతో కూడిన ఈ పథకాన్ని ఈనెల 13న ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)