రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి త్వరలో డీలిస్ట్ ?

Telugu Lo Computer
0

నిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి త్వరలో డీలిస్ట్ అవ్వబోతుంది. రిలయన్స్ క్యాపిటల్‌ను హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసిన తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇకపై దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ క్యాపిటల్ షేర్లు ట్రేడ్ అవ్వవు. ఎందుకంటే కంపెనీ కొత్త యజమాని హిందూజా గ్రూప్ షేర్లను డీలిస్ట్ చేయాలని నిర్ణయించటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి 2008లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.2,700 కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం షేర్ ధర దాదాపు 99 శాతం క్షీణించి రూ.11 వద్ద ఉంది. షేర్ల డీలిస్టింగ్ జరిగితే ఈక్విటీ షేర్ హోల్డర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ సున్నా కాబోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీ పాత కంపెనీలోని ఇన్వెస్టర్లకు ఎలాంటి వాటాలు ఇవ్వబోదని వెల్లడైంది. దీనివల్ల అనిల్ అంబానీ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులకు భారీగా నష్టం జరగనుంది. ఇప్పటికే రిలయన్స్ క్యాపిటల్‌పై నియంత్రణ సాధించేందుకు హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సమర్పించిన రూ.9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) గత మంగళవారం ఆమోదించింది. ఇందులో రుణదాతలు 63 శాతం బకాయి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీకి వ్యతిరేకంగా క్లెయిమ్‌ చేసిన మొత్తం రూ.38,526.42 కోట్లలో రూ.26,086.75 కోట్ల క్లెయిమ్‌లను మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)