రిహాన్నా కోసం "వంతారా థీమ్ కారు" !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల ప్రివెడ్డింగ్ సెలబ్రేషన్స్ వేడుకకు సర్వం సిద్దమైంది. అతిథులందరూ ఒక్కొక్కరుగా జామ్‌నగర్‌ కు చేరుకుంటున్నారు. జామ్‌నగర్‌లోని గ్రీన్స్ కాంప్లెక్స్‌లో మార్చి 1 నుంచి 3 వరకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలో దేశ విదేశాల నుంచి వేలాది మంది ప్రముఖులు పాల్గొంటారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగే మూడు రోజులు..ఒక్కో రోజు ఒక్కో థీమ్ తో జరుగుతుంది. అయితే గ్లోబల్ ఐకాన్ పేరుపొందిన సింగర్ రిహాన్న కూడా ఈ వేడుకలో తన ఫర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్దమైంది. రిహాన్నా,ఆమె టీమ్ ఇప్పటికే జామ్ నగర్ చేరుకుంది. గురువారం ఉదయం రిహన్నా జామ్ నగర్ కు చేరుకోగా ఆమెకు స్వాగతం పలికేందుకు జామ్‌నగర్ ఎయిర్ పోర్ట్ బయట వంతారా థీమ్ తో ఉన్న కారు నిలిచి ఉన్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ కారుపై అడవిలో తిరుగుతున్న ఏనుగుల బొమ్మలు ఉంచబడ్డాయి. రిలయన్స్ ఇటీవల ప్రారంభించిన వంతార కార్యక్రమాన్ని ఇది గుర్తు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ ఫిబ్రవరి 26న తమ వంతార (స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఒక పెద్ద కార్యక్రమం. గాయపడిన, ఆదరణ కోల్పోయిన, వేటగాళ్ల చెంత బందీ అయిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, సంరక్షించడం, పునరావాసంపై దృష్టి పెట్టడం ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లో రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో 3000 ఎకరాల్లో విస్తరించి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)