60 వేల ఉద్యోగాలకు 50 లక్షల మంది ?

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ అన్నీ ఫుల్..అభ్యర్థులతో కిక్కిరిసి పోయాయి. ఇసుక వేస్తే రాలనంత మంది అక్కడ ఉన్నారు. తమ భవిష్యత్ పై కలలు కంటూ రాబోయే రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.శని, ఆదివారాల్లో పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్ష సందర్భంగా కాన్పూర్ రైల్వే స్టేషన్ తో సహా అన్నీ రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లలో ఇదే దృశ్యం. రెండు రోజులు పరీక్ష.. వారి భవిష్యత్ అంతా ఆ పరీక్షల్లోనే ఉంది. ఉన్నవి 60వేల పోస్టులు.. అప్లయ్ చేసుకుంది దాదాపు 50 లక్షల మంది. ఎవరిని ఉద్యోగం వరిస్తుందో తేల్చే పరీక్ష అది. పోలీస్ రిక్రూట్ మెంట్ కోసం నిర్వహిస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 60 వేల పోస్టుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ వేసింది. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 48లక్షల 17వేల 441 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,385 పరీక్షా కేంద్రాల్లో శని, ఆదివారాల్లో(ఫిబ్రవరి 18,19) ఎగ్జామ్ నిర్వహిస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైల్వే స్టేషన్ చూసినా ఏ బస్టాండ్ చూసినా కిక్కిరిపోయి కనిపించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)