4 నుంచి 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మౌలాలి-సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. 4వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. టైమ్ టేబుల్ ప్రకారం ఈ రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఈ నెల 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. వీటితోపాటు మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్‌ మార్గంలో నడిచే హైదరాబాద్‌-సిర్పూర్‌-కాగజ్‌నగర్‌, వికారాబాద్‌-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిలిపివేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)