భార్యలతో భర్తలు మంచిగా నడుచుకోవాలి !

Telugu Lo Computer
0


ఎంఐఎం పార్టీ సమావేశంలో భార్యలతో మగవారు మంచిగా నడుచుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ''నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. ఇది చాలా మందిని కలవరపెట్టింది. మీ భార్య మీ బట్టలు ఉతకాలి, మీకు వంట చేయాలి, మీ తలకు మసాజ్ చేయాలి అని ఖురాన్ చెప్పలేదు. వాస్తవానికి భార్య సంపాదనపై భర్తకు హక్కు లేదు. కానీ, భర్త సంపాదనపై భార్యకు హక్కు ఉంటుంది, ఎందుకంటే ఆమె ఇంటిని నడపాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు. చాలా మంది తమ భార్యలు వంట చేయడం లేదని, వారి వంటలో తప్పులు కనుగొని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఇది ఇస్లాంలో ఎక్కడా రాయబడలేదని చెప్పారు. భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారు ఉన్నారు, వారిని కొట్టే వారు ఉన్నారు, మీరు నిజమైన ప్రవక్త అనుచరులైతే, ఆయన మహిళలపై ఎక్కడ చేయి ఎత్తాడో చెప్పాలని సవాల్ విసిరారు. అనవసరంగా మీ భార్యపై కోపం వెళ్లగక్కడం పౌరుషం కాదని అన్నారు. ఇక్కడ కొంతమంది తమ భార్యలు ఎదురుతిరిగి సమాధానం చెబితే మనస్తాపం చెందుతారు, చాలా మంది రాత్రి వరకు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, వారి భార్యలు, పిల్లలు, తల్లులు వారి కోసం ఇంట్లో ఎదురుచూస్తుంటారని, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ కోరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)