రూ.లక్ష కోట్ల విలువ కలిగిన బ్యాంకుగా అవతరించిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా !

Telugu Lo Computer
0


స్టాక్‌ మార్కెట్‌ లో  ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. ఇప్పటివరకు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లు రూ.1 లక్ష కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులుగా అవతరించగా తాజాగా 'యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ' నాలుగో బ్యాంకుగా రికార్డులకెక్కింది. 2023లో యూబీఐ స్టాక్‌ ధర దాదాపు 50 శాతం పెరగడంతో ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ప్రతి త్రైమాసికానికి ఈ బ్యాంకు లాభాలను సాధిస్తోంది. ఉదాహరణకు 2023 జనవరిలో ఒకరు రూ.100 పెట్టుబడి పెడితే ఆ ఏడాది చివరకు 50 రూ.లాభంతో ఏకంగా 150 అయి ఉండేది. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు అంత ప్రాధాన్యానికి నోచుకోలేదు. మోడీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రికవరీ రేటు పెరగడంతో.. ఒక్కసారిగా అవి మదుపరుల దృష్టిలో పడ్డాయి. మూడేళ్లుగా ఈ స్టాక్‌ ఏకంగా 316.87 శాతం పెరగడం గమనార్హం. గత ఏడు రోజులుగా 10.58 శాతం పెరిగింది. ఇవే కాదు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల లాభాలు పెరుగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)