రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీలో గగనతల ఆంక్షలు !

Telugu Lo Computer
0


ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి సిద్ధమయ్యేందుకు ఈనెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు గగనతల పరిమితులను విధించారు. షెడ్యూల్డ్ విమాన సర్వీస్‌లపై దీని ప్రభావం ఉండదు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ ఎయిర్ సర్వీస్‌కు సంబంధించి నాన్ షెడ్యూల్ విమానాలు మాత్రం ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 వరకు ల్యాండింగ్ లేదా టేకాఫ్ చేయడానికి అనుమతించరు. ఈ ఆంక్షలు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటాయి. ఐఎఎఫ్, బిఎస్‌ఎఫ్, ఆర్మీ హెలికాప్టర్ సర్వీస్‌లకు, ప్రభుత్వానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లపై ఆంక్షల ప్రభావం ఉండదు.

Post a Comment

0Comments

Post a Comment (0)