వయోపరిమితి పెంచిన రైల్వే శాఖ !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాల భర్తీకి ఆర్‌ఆర్‌బీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితి 18-30 ఏళ్లని తెలపగా, దీన్ని పెంచుతున్నట్లు తాజాగా రైల్వే శాఖ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఖాళీలకు జులై 1వ తేదీ నాటికి 18-33 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చని ప్రకటించింది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఈ పోస్టులకు జనవరి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ నుంచి ఆగస్టు మధ్య సీబీటీ-1 ఎగ్జామ్ .. సీబీటీ-1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు నెలలో సీబీటీ-2 పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబరులో ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆప్టిట్యూట్ టెస్ట్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. నవంబరు లేదా డిసెంబరులో ఎంపిక జాబితా విడుదల చేస్తారు.


Post a Comment

0Comments

Post a Comment (0)