చియా గింజలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


చియా గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లు, వివిధ రకాల అవసరమైన పోషకాలు ఉంటాయి. వీటిలో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ తినడం వల్ల ఫిట్‌గా ఉండగలరనడంలో సందేహం లేదు. ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. చియా గింజలను నీటిలో నానబెట్టినప్పుడు ఏర్పడే జెల్ అవసరమైన పోషకాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. కాబట్టి నానబెట్టిన చియా సీడ్స్‌ తినడం వల్ల అందులోని పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి. అంతేకాకుండా చియా ఈ విధంగా తింటే త్వరగా జీర్ణమవుతుంది. పాలు లేదా నీటిలో చియా సీడ్స్‌ 1:3 నిష్పత్తిలో నానబెట్టాలి. 1 భాగం చియా గింజలు, 3 భాగాలు నీరు లేదా పాలు తీసుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉంచండి. మధ్యలో చెంచాతో మిశ్రమాన్ని కదిలించండి. మిశ్రమం చిక్కగా మారిన తర్వాత దానిని తినవచ్చు. పాలలో చియా గింజలు కలిపితే అందులో నచ్చిన పండ్లు, నట్స్‌, ఇతర డ్రై ఫ్రూట్స్‌ వంటివి కలుపుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)