కాళ్లు, చేతులు తిమ్మిర్లు - నివారణోపాయాలు !

Telugu Lo Computer
0

 


కాళ్లు, చేతులు తిమ్మిర్లకు విటమిన్ బి12 లోపంగా  వైద్యులు చెబుతున్నారు. దీని తీవ్రత క్రమంగా పెరిగి కాళ్ళ నొప్పి వస్తుంది. విటమిన్ బి12 లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బి12 అంటే ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది మన శరీరంలో సాధారణంగానే వృద్ది అవుతుంది. దీని లోపం తలెత్తినప్పుడు మోకాళ్ల నొప్పులు తలెత్తుతాయి. ఈ లోపాన్ని ఎలాంటి మందులు, ఇంజక్షన్లు అవసరం లేకుండానే అధిగమించవచ్చు. యువకులు అయితే రోజుకు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 తీసుకోవాలి. లేకపోతే, శరీరం క్రమంగా బలహీనపడుతుంది. దీని కారణంగా, రుచి, వాసన కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనా శక్తి లేపోవడం జరుగుతుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా మేక, గొర్రెల్లో అధికశాతం ఈ విలువలు ఉంటాయి. సీఫుడ్, చేపలు, గుడ్లలో కూడా పుష్కలంగా ఉంటుంది. శాకాహారులు అయితే ఆకు కూరలు, పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల ఈ లోపాన్ని అధిగమించవచ్చు. పాలు, పెరుగు, జున్ను లేదా పులిసిన మజ్జిగలో కూడా బి12 లభిస్తుంది. పిస్తా, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‎లలో కూడా అధికంగా ఉంటుంది. పుష్కలంగా మంచి నీటిని తాగడం వల్ల కూడా బి12 లభిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)