హమాస్‌ అగ్ర నేతలు గాజాను వీడొచ్చు !

Telugu Lo Computer
0


బందీలు విడుదల, ఇజ్రాయెల్‌-హమాస్ ల మధ్య పోరుకు విరామం ఇచ్చే విషయమై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ వైపు నుంచి ఆశ్చర్యకరమైన ప్రతిపాదన వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ అగ్రనేతలు గాజాను విడిచిపెట్టి వెళ్లొచ్చని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వం సూచించిందట. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. హమాస్‌ ఉగ్రదాడి తర్వాత ఆ మిలిటెంట్‌ గ్రూప్‌ను భూస్థాపితం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎదురు దెబ్బలు తింటోంది. గ్రూప్‌ అగ్రనేతలను బంధించడం, మట్టుపెట్టడం చేయలేకపోతోంది. 70 శాతం హమాస్‌ దళం ఇంకా చెక్కుచెదరకుండా ఉందని సమాచారం. ఈ క్రమంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హమాస్‌ అగ్రనేతలు గాజాను వీడితే.. ఈ ప్రాంతం బలహీనపడే అవకాశం ఉంది. దాంతో ఈ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించే ఉద్దేశంతోనే నెతన్యాహు ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)