తగ్గిన బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0

గత వారం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న ఉదయం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 250, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గిన విషయం తెలిసిందే. నిన్నటి కంటే ఇవాళ బంగారం ధరలు 10 గ్రాములకు మరో రూ.400 తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ఇదే సమయానికి రూ.58,500 గా ఉండగా రూ.400 తగ్గి ఇవాళ రూ.58,100గా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములకు రూ.63,820గా ఉండగా, ఇవాళ ఉదయం 6 గంటలనాటికి 440 తగ్గి రూ.63,380గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర నిన్న రూ.80,000గా ఉండగా, ఇవాళ రూ.2,000 తగ్గి రూ.78,000గా ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)