వైసీపీకి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి  వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వడం లేదని జగన్ స్పష్టం చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పోటీకి అవకాశం ఇస్తే అక్కడి నుంచి బరిలోకి దిగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వెల్లడించారు. తాను మాత్రమే కాదని, భార్య కూడా పోటీ చేస్తారని తెలిపారు. సీఎం జగన్ నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014, 2019లో తనకు మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపారని.. ఆ తర్వాత ఇవ్వలేదని వాపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుంటుంబంపై ఉన్న ప్రేమతో తాము జగన్ వెంట నడిచామని తెలిపారు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలోనూ ఆయన వెంటే ఉన్నామని గుర్తు చేశారు. కానీ తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరని అసలు ఊహించలేదని పేర్కొన్నారు. తనపై నియోజకవర్గం ప్రజలకు, కార్యకర్తలకు చాలా నమ్మకం ఉందని, అందుకే తాను, తన భార్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)