వందే భారత్‌లో పాడైన భోజనం?

Telugu Lo Computer
0


ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్‌ రైలులో ఓ ప్రయాణికుడికి భోజనం విషయంలో చేదు అనుభవం ఎదురైంది. ఎక్స్‌లో వందేభారత్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా, దుర్వాసన వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికుడు వెంటనే వీడియో తీశాడు. పాడైపోయిన భోజనం ఇచ్చారంటూ ఆ కస్టమర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన డబ్బులు తనకు రిటర్న్‌ చేయాలంటూ.. ఆ ఘటనంతా వీడియో రూపంలో బయటకు రావడంతో రైల్వే శాఖ స్పందించింది. ఫిర్యాదు అందిందని.. ఘటనపై దర్యాప్తు చేపడతామని రైల్వేస్‌సేవ తెలియజేసింది. ఫిర్యాదు వివరాల కోసం తమను సంపద్రించాలంటూ సదరు ఎక్స్‌ యూజర్‌కు సూచించింది. ఇక.. ఐఆర్‌సీటీసీ సైతం సదరు వీడియోపై స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూనే.. విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సర్వీస్‌ ప్రొవైడర్‌ పెనాల్టీ విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)