రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం !

Telugu Lo Computer
0


హదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై గూగుల్‌ ప్రతినిధులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించారు. గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తోట మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. గూగుల్‌ మ్యాప్స్‌, గూగుల్‌ ఎర్త్‌ ప్లాట్‌ఫాంల వినియోగంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన చంద్రశేఖర్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏఐ ప్రతీ రంగాన్ని ప్రభావితం చేస్తోందన్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో డిజిటలీకరణ అజెండాను అభివృద్ధి చేసేందుకు ఆయన ఆసక్తి చూపారు. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నాణ్యమైన సేవలు అందించేందుకు కావాల్సిన సాంకేతికత, నైపుణ్యాలు తమ వద్ద ఉన్నాయని సీఎంకు వివరించారు. సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)