ఉత్తరప్రదేశ్‌లో మరో ఐదు కొత్త విమానాశ్రయాలు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లో మరో ఐదు కొత్త విమానాశ్రయాలు  నెలరోజుల్లో అందుబాటు లోకి వస్తాయని, దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుంటుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా గురువారం వెల్లడించారు. అయోధ్య నుంచి అహ్మదాబాద్‌కు ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభం సందర్భంగా వర్చువల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అజంగఢ్, అలిగఢ్, మొరాదాబాద్, చిత్రకోట్, శ్రావస్తి నగరాల్లో ఈ కొత్త విమానాశ్రయాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. అయోధ్య విమానాశ్రయం, రన్‌వే విస్తరించడమౌతుందని, దీనివల్ల పెద్ద విమానాలు, అంతర్జాతీయ విమానాల ఆపరేషన్ సాధ్యమవుతుందని చెప్పారు. అయోధ్య లోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్ 30న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఆరోజు ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లు అయోధ్యలో ఆపరేట్ అయ్యాయి. అయోధ్య విమానాశ్రయం రెండోదశ విస్తరణ త్వరలో ప్రారంభమౌతుందని, అనేక విమానసర్వీస్‌లు అయోధ్యకు అనుసంధానం అవుతాయని మంత్రి సిందియా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)