కాక్ టెయిల్ సినిమాలో క్రూజ్‌ని గుర్తు తెచ్చుకోండి !

Telugu Lo Computer
0


నంద్ మహీంద్రాని ఓ డ్రింక్ వెండర్ స్కిల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక సాధారణమైన వీధి దుకాణంలో డ్రింక్స్ అమ్ముతున్న ఓ వ్యాపారి వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసారు. ఇటీవల కాలంలో ఏదైనా తినే, తాగే ఫుడ్ రుచి ఎలా ఉంది? అనే దాని కంటే దానిని ఎలా తయారు చేస్తున్నారో చూపించే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో. వీడియోలో ఓ వ్యాపారి పానీయం తయారు చేసే విధానం మొత్తం గారడీ చేస్తున్నట్లు అనిపిస్తుంది. గ్లాసుని గాల్లో విసురుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ డ్రింక్‌ను అద్భుతంగా మిక్స్ చేస్తున్నట్లు కనిపించింది. వీడియో చివర్లో పానీయం అందిస్తాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ' ఈ పెద్ద మనిషి నూతన సంవత్సర వేడుకలో బార్టెండర్ కాదు. కానీ అతను ఖచ్చితంగా చేయగలడు. ప్రతిభ అన్ని రకాలుగా ఉంటుంది. టామ్ క్రూజ్‌ని తల్చుకోండి. కాక్ టెయిల్ సినిమాలో క్రూజ్‌ని గుర్తు తెచ్చుకోండి' అని రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని ప్రతిభ అమోఘం అని కొందరు మెచ్చుకున్నారు. అయితే డ్రింక్ తయారు చేసేటపుడు వేస్టేజీ ఎక్కువ కనిపించిందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)