దేశంలో కొత్తగా 602 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది.నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి. కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు అమాంతం పెరిగాయి. ఏకంగా 500 దాటాయి. జనవరి 2వ తేదీ వరకూ కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు దేశవ్యాప్తంగా 511కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ తరహా కేసులు కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కర్ణాటక రాష్ట్రంలో 199 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కేరళలో 148 కేసులు, గోవాలో 47, గుజరాత్‌లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో నాలుగు, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. మరోవైపు BA 2.86 రకానికి చెందిన ఈ జేఎన్‌.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన 'వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)