ఇరాన్‌కు చైనా హెచ్చరిక ?

Telugu Lo Computer
0


యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కొంతకాలంగా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ఎర్రసముదంలో ఈ దాడుల్ని నిలువరించాలని ఇరాన్‌ను చైనా హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్‌ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. 'చైనా ప్రయోజనాలకు ఏవిధంగానైనా హాని కలిగితే ఆ ప్రభావం ఇరాన్ తో ఉన్న వ్యాపార సంబంధాలపై పడుతుంది. అందుకే సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి' అని డ్రాగన్ చెప్పినట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న వేళ.. నౌకలపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలు, లేదా ఇజ్రాయెల్‌తో సంబంధమున్న నౌకలను తాము లక్ష్యంగా చేసుకుంటున్నట్లు హౌతీ రెబల్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌కు వస్తున్న ఓ నౌకను హైజాక్‌ చేయడంతో పాటు.. భారత్‌లో తయారైన జెట్‌ ఇంధనాన్ని తీసుకెళ్తోన్న ఆర్డ్‌మోర్‌ అనే నౌకపైనా దాడికి యత్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)