భారత్‌కు ధన్యవాదాలు తెలిపిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌

Telugu Lo Computer
0


ఢిల్లీలోని కర్తవ్య పథ్‌ లో జరిగిన రిపబ్లిక్‌ డే ఉత్సవాలు అంబరాన్నంటాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌  అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి, ప్రధాని మోదీతో కలిసి మాక్రాన్‌ వీక్షించారు. ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఫ్రాన్స్‌ దళం కూడా పాల్గొంది. మొత్తం 90 మంది సభ్యులతో కూడి ఫ్రెంచ్‌ దళం ప్రదర్శన ఇచ్చింది. ఆ సమయంలో రఫేల్‌ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా షేర్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ దేశానికి దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)