లక్షదీవుల్లో ప్రధాని స్నార్కెలింగ్ !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనలో భాగంగా సముద్రంలో స్నానం చేసి లోతైన నీటిలో స్నార్కెలింగ్ చేశారు. సముద్ర తీరంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై సందేశం ఇచ్చారు. గురువారం తన లక్షద్వీప్ పర్యటన గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌(ట్విట్టర్‌)లో పంచుకున్నారు. లక్షద్వీప్‌లో రూ.1,156 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం వివిధ ప్రాంతాలను సందర్శించారు. లక్షద్వీప్‌లోని అద్భుతమైన అనుభవాలను చెప్పడంతో పాటు, అక్కడి ప్రజలకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)