బోరుబావిలో పడ్డ రెండున్నరేళ్ల చిన్నారి !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని ద్వారక జిల్లా కళ్యాణ్‌పురి తాలూకా రాన్‌ గ్రామంలో ఓ రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముంగిట ఉన్న బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారి బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బాలికకు ఊపిరాడేందుకు బోరుబావి లోపలికి ఆక్సిజన్‌ పంపించారు. జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికార యంత్రాంగమంతా రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)