పోలీస్‌పై లారీ డ్రైవర్ల దాడి !

Telugu Lo Computer
0


ముంబైలో రోడ్డు ప్రమాదాల కేసులో జైలు శిక్షను పదేళ్లకు పెంచడం, ఏడు లక్షల వరకు జరిమానా విధించే కొత్త నేర చట్టానికి వ్యతిరేకంగా లారీ, ప్రైవేట్‌ బస్సు డ్రైవర్లు నిరసనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం నవీ ముంబైలోని జేఎన్‌పీటీ రహదారి దిగ్బంధానికి లారీ డ్రైవర్లు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీస్‌పై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. నిరసన ప్రాంతం నుంచి తరిమికొట్టారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు స్పందించారు. సుమారు 40 మంది లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. లారీ డ్రైవర్లు శాంతియుతంగా నిరసన తెలుపాలని సూచించారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడి శాంతి భద్రతకు విఘాతం కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)