మంటల్లో చిక్కుకున్న జపాన్ విమానం

Telugu Lo Computer
0


టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్ 516 విమానం ప్రమాదానికి గురైంది. విమానాశ్రయంలోని రన్ వేపై దిగుతుండగా మంటల్లో చిక్కుకుంది. ఆ దేశ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK ప్రసారం చేసిన వీడియోల్లో విమానం కిటికీల నుంచి మంటలు రావడం కనిపించింది. కాగా ఈ ప్రమాదానికి కారణం కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీ కొట్టడమేనని తెలిపింది. ఈ ఘటన పై జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ హక్కైడోలోని షిన్-చిటోస్ విమానాశ్రయం నుండి 300 మందికి పైగా ప్రయాణికులతో విమానం బయలు దేరినట్లు చెప్పారు. విమానం రన్ వే పై దిగుతున్న కోస్ట్ గార్డు ఎయిర్ క్రాఫ్ట్‌ను ఢీ కొట్టిన్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు విమానం వద్దకు చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. అయితే.. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బందితో కలిపి 367 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఎన్‌హెచ్‌కే తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)