700కి పైగా పోస్టుమార్టంలలో సహాయపడిన మహిళకు రామాలయ ఆహ్వానం !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ సంతోషి దుర్గ 700కి పైగా పోస్టుమార్టంలలో సహాయపడింది. ఈమెను  జనవరి 22న జరగబోయే రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. సంతోషి దుర్గ నర్హర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జీవన్ దీప్ కమిటీకి దాదాపుగా 18 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ సమయంలో 700కి పైగా శవపరీక్షల్లో ఆమె సాయపడ్డారు. ఆమె చేసిన కృషికి వివిధ సంఘాల నుంచి ఆమెకు ప్రశంసలు దక్కాయి. ఈ ఆహ్వానాన్ని తన జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించలేదని.. నా జీవితంలో నన్ను కూడా అయోధ్యకు పిలుస్తారని అనుకోలేదని, రాముడి ఆహ్వాన లేఖ పంపి నన్ను పిలిచారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ లేఖతో తాను ఆశ్చర్యపోయానని, తన కళ్ల నుంచి ఆనందంతో కన్నీల్లు వచ్చాయని వెల్లడించారు. ఆహ్వాన పత్రం పంపినందుకు సంతోషి దుర్గ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)