పాత కక్షలకు యువకుడు బలి !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని మీనా బజార్‌ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున పాత కక్షలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని దారుణంగా కత్తులతో పొడించి చంపారు. ఈ హత్యకు సంబంధించి జామామసీద్‌ పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున 5.20 గంటలకు సమాచారం అందింది. ఆస్పత్రి నుంచి ఫోన్‌ చేసి పోలీసులకు విషయం చెప్పారు. దాంతో వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఘజియాబాద్‌కు చెందిన అర్మాన్‌ (19) గా పోలీసులు గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్మాన్‌ తన తండ్రితో కలిసి మీనా బజార్‌లో వీధి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్మాన్‌ మరో ముగ్గురు వ్యక్తులతో పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో వాళ్లు ఆర్మాన్‌ను హత్యచేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్‌ 302 (హత్య), సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)