ఇంజెక్షన్‌కు బదులు ట్యాప్‌ వాటర్‌ వాడడంతో 10మంది మృతి !

Telugu Lo Computer
0


మెరికా ఒరెగాన్‌ రాష్ట్రం మెడ్‌ఫోర్డ్‌ నగరంలో ఉన్న అసంటే రోగ్‌ ప్రాంతీయ వైద్యశాలలో కొంతకాలంగా ఇన్‌ఫెక్షన్‌ కేసులు పెరిగాయి. బాధితుల ఫిర్యాదుతో ఆస్పత్రి సిబ్బంది పరిశీలన మొదలుపెట్టారు. నొప్పి నివారణకు ఉపయోగించే ఔషధానికి బదులు శుద్ధి చేయని కుళాయి నీటిని కలిపినట్లు గుర్తించారు. దీన్నే రోగులకు ఎక్కించారని.. ఆస్పత్రిలో గతంలో పనిచేసిన ఓ నర్సు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానించారు. ఏడాది కాలంగా అనేక మంది రోగులకు ఈ తరహా ఇంజెక్షన్‌ ఇవ్వడంతో దాదాపు 10 మంది రోగులు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రోగి మరణించిన విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ఇటీవల పోలీసులకు తెలియజేశాయి. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు నర్సు వ్యవహారం బయటపడింది. ఆ నొప్పి నివారణ ఔషధాన్ని నర్సు కాజేసినట్లు ఆస్పత్రి వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే, ఔషధం స్థానంలో కుళాయి నీటిని మార్చడం వల్లే ఈ మరణాలు సంభవించాయా? అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)