రోడ్డుపక్కన ఉన్న నాన్ వెజ్ స్టాళ్లన్నింటినీ మూసేయండి !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని జైపూర్‌ హవా మహల్ సీటును గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ ప్రాంతంలోని వీధుల్లోని అన్ని నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశించారు. ఫలితాలు ప్రకటించిన 24 గంటల తర్వాత బాల్ముకుంద్ ప్రభుత్వ అధికారిని పిలిచి, సాయంత్రంలోగా అన్ని నాన్-వెజ్ ఫుడ్ స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశించారు. వీధులు శుభ్రంగా ఉండాలని తెలిపారు. అయితే  ఎమ్మెల్యే బాల్ముకుంద్ ఓ ప్రభుత్వ అధికారికి ఆదేశాలు జారీ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజలతో మమేకమయ్యేందుకు బల్ముకుంద్ బయల్దేరాడు. ఈ క్రమంలో.. రోడ్డుపై నుంచి వెళ్తుండగా ఓ అధికారిని పిలిచి నాన్‌వెజ్‌ను బహిరంగంగా అమ్మవచ్చా అని అడిగాడు. అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వండి. మీరు దానిని సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. రోడ్డుపై బహిరంగంగా నాన్‌వెజ్‌ విక్రయాలు సాగించే వారు కనిపించడం లేదన్నారు. సాయంత్రంలోగా నివేదిక అందించాలని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో.. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలపై స్పందించి విమర్శించారు. అలా మాట్లాడటం సరికాదని.. నాన్‌వెజ్‌ ఫుడ్‌ స్టాల్‌ మూసేయమనడం దౌర్జన్యమన్నారు. ఇలా తీసేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. కాగా.. బాల్ముకుంద్ హవా మహల్ అసెంబ్లీ స్థానం నుంచి 600 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ఆర్ తివారీని ఓడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)