సామాన్యుడులా కేసీఆర్ !

Telugu Lo Computer
0


బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక అధికారితో తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. అనంతరం ఆయన ప్రగతి భవన్‌ను ఖాళీ చేశారాయన. ప్రగతి భవన్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో కేసీఆర్ భావోద్వేగంతో కనిపించారు. సీఎం కాన్వాయ్‌ను ప్రగతి భవన్‌లోనే వదిలిపెట్టిన కేసీఆర్, మేనల్లుడు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కారులో అక్కడ నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. ఈ సమయంలో కేసీఆర్ సామాన్యుడులా ప్రయాణించారు. రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ చోటల్లా . కారును నిలుపుతూ ఓ సామాన్య ప్రయాణికుడులా కేసీఆర్ ప్రయాణించారు. బీఆర్ఎస్ ఓటమి తరువాత ఆ పార్టీని ఎవరు ముందుండి నడిపిస్తారనే టాక్ ఆ పార్టీలో చర్చ సాగుతుంది. గతంలో మాదిరిగా కేసీఆర్ పార్టీలో క్రియాశీలకంగా ఉండే అవకాశం కనిపించడం లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)