గాల్లో తేలుతూ బైక్ డ్రైవ్ !

Telugu Lo Computer
0


పంజాబ్ కు చెందిన హర్ష్ బిలాస్ పూర్ ఆకాశంలో స్కూటీతో పారాగ్లైడింగ్ చేశాడు. హర్ష్ భూమినుంచి 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో 6 నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణించాడు. హిమాచల్ ప్రదేశ్ లోని ఓ ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనంపై ఆకాశంలో ఎగురుతూ చూసేవారిని థ్రిల్ చేశాడు. ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్, కెమెరాల్లో బంధించారు. పారాగ్లైడర్ అద్భుతమైన ఈ సాహస విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో హిమాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బండ్లధర్ లో హర్ష్ బిలాస్ పూర్ అనే పారాగ్లైడర్ తన స్కూటీతో ఆకాశంలో సునాయాసంగా ప్రయాణిస్తు్న్న దృశ్యాలు కనిపిస్తాయి.ఇది చూసిన స్థానికులు ఈ వింత దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. బైక్ పై ఇలా ఆకాశంలో పారాగ్లైడింగ్ ఇదే మొదటిసారి. హర్ష్ బిలాస్ పూర్ కంటే ముందు ఎవరూ ఇలా ప్రయాణించలేదట. పైలట్ సహకారంతో తాను విజయవంతంగా ఆకాశంలో స్కూటీపై ప్రయాణించగలిగానని హార్ష్ బిలాస్ పూర్ చెపుతున్నాడు. బండ్లధర్ పర్యాటక ప్రాంతంలో ఇలాంటి సాహస విన్యాసం జరగడం కూడా ఇదే మొదటిసారి అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)