మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా జితూ పట్వారీ

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్  లో కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా కమల్ నాథ్‌ని తొలగించి, ఆయన స్థానంలో జితూ పట్వారీని నియమించింది. జితు పట్వారినీ తక్షణమే రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడి పేరిట ఆదేశాలు జారీ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా కమల్ నాథ్ అందించిన సేవల్ని పార్టీ అభినందిస్తోందని ఒక ప్రకటనలో కాంగ్రెస్ తెలిపింది. రవ్ నియోజకవర్గం నుంచి 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందిన జితు పట్వారీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మధు శర్మ చేతిలో ఏకంగా 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్‌గా పనిచేశారు. పీసీసీ చీఫ్‌తో పాటు ఉమంగ్ శింగార్‌ని ప్రతిపక్ష నేతగా, హేమంత్ కటారేని మధ్యప్రదేశ్ విధానసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్‌గా నియమించింది.పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్న జితూ పట్వారీ, గతంలో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నతవిద్యా, యువజన, క్రీడా మంత్రిగా పనిచేశారు. 2018లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) చీఫ్‌గా కమల్ నాథ్ నియమితులైనప్పుడు, పట్వారీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)