కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ కన్నుమూత !

Telugu Lo Computer
0


కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా (86) శనివారం తుదిశ్వాస విడిచారని రాజభవన వర్గాలు వెల్లడించాయి. 'కువైట్ పాలకుడి మృతి పట్ల తీవ్రమైన బాధతో సంతాపం తెలియజేస్తున్నాం' అని ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. మునుపటి పాలకుడు షేక్ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ సబా,. షేక్ నవాఫ్‌ను 2006లో యువరాజుగా ప్రకటించారు. 2020లో 91 ఏళ్ల వయసులో షేక్ సబా కన్నుమూయడంతో.. కువైట్ పాలకుడిగా నవాఫ్ బాధ్యతలు స్వీకరించారు. కరోనా సమయంలో 2020లో చమురు ధరల పతనంతో సంక్షోభంలో చిక్కుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. కాగా, అత్యవసర ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఈ నవంబర్‌లో షేక్ నవాఫ్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య సమస్య మాత్రం బయటకు వెల్లడికాలేదు. ఈ క్రమంలోనే ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. 1937లో జన్మించిన ఆయన.. 2020 సెప్టెంబర్‌లో కువైట్ పాలనాపగ్గాలు చేపట్టి మూడేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)