విద్యార్థుల సమాధానానికి షాకైన హేమంత్‌ సోరెన్‌ !

Telugu Lo Computer
0


ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ఇటీవల కొందరు పాఠశాల విద్యార్థులతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోరెన్‌ మాట్లాడుతూ  ఆదివాసీ సంక్షేమ పథకం కింద బాలికలకు సైకిళ్ల కోసం కేటాయించిన నిధుల గురించి ప్రస్తావించారు. అనంతరం 'సైకిళ్ల కోసం ఇచ్చిన నగదు మీకు అందిందా?' అని అక్కడున్న బాలికలను సీఎం ప్రశ్నించగా వారంతా 'లేదు.. లేదు' అంటూ బదులిచ్చారు. దీంతో సీఎం పక్కనే ఉన్న అధికారితో మాట్లాడారు. ఆ తర్వాత.. 'సరే ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోనే పడుతాయి' అని చెప్పారు. 'సావిత్రిబాయి ఫూలే యోజన' పథకం ప్రయోజనాలు అందుతున్నాయా అని సీఎం అడగ్గా మళ్లీ అదే సమాధానం వచ్చింది. 'తమకు అందలేదు' అంటూ బాలికలు చెప్పారు. దీంతో ఒకింత ఇబ్బందికి గురైన సీఎం సోరెన్‌ మళ్లీ పక్కనున్న అధికారిని అడిగి కారణాలు తెలుసుకున్నారు. ఆ పథకాల ప్రయోజనాలు అందరికీ అందుతాయని చెప్పారు. ఇది ఎప్పుడో జరిగిందో స్పష్టంగా తెలియదు గానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది కాస్తా రాజకీయ విమర్శలకు తెరలేపింది. ఈ వీడియోను ఝార్ఖండ్‌ భాజపా అధ్యక్షుడు బాబులాల్‌ మరాండి ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ సోరెన్‌పై విమర్శలు గుప్పించారు. ''ఈ వీడియోను ప్రభుత్వ వేదికల నుంచి తొలగించాలని సోరెన్‌ ఆదేశించినట్లు తెలిసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)