డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ !

Telugu Lo Computer
0


హుజన్ సమాజ్ పార్టీ లోక్ ‭సభ సభ్యుడు డానిష్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయవద్దని ఆయనకు చాలాసార్లు మౌఖికంగా చెప్పానని, అయినప్పటికీ పార్టీపై నిరంతరం ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నానని బీఎస్పీ విడుదల చేసిన ప్రకటనలో ఆమె తెలిపారు. 2018లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ దేవెగౌడకు చెందిన జనతా దళ్ సెక్యూలర్ పార్టీ సభ్యుడిగా డానిష్ అలీ పని చేశారు. అయితే 2018లో జరిగిన కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, జనతా పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో దేవెగౌడ పార్టీ తరపున డానిష్ అలీ చాలా యాక్టివ్‌గా పని చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం హెచ్‌డీ దేవెగౌడ అభ్యర్థన మేరకు డానిష్ అలీని అమ్రోహా నుంచి బీఎస్పీ టికెట్ ఇచ్చి అభ్యర్థిగా పోటీకి దింపారు. అదే ప్రకటనలో.. “డానిష్ అలీకి టిక్కెట్ ఇవ్వడానికి ముందు, బహుజన్ సమాజ్ పార్టీ విధానాలను ఎల్లప్పుడూ అనుసరిస్తానని, పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తానని హెచ్‌డీ దేవెగౌడ హామీ ఇచ్చారు. ఈ హామీకి డానిష్ కూడా అంగీకరించి ప్రమాణం చేశారు. ఆ తర్వాతనే అలీకి బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వం ఇచ్చాము'' అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)