నకిలీ బంగారం బిస్కట్లు విక్రయించిన ముగ్గురు అరెస్ట్‌ !

Telugu Lo Computer
0


జార్ఖండ్‌లోని పాలమూలో ఒక వ్యాపారికి తుపాకీ గురిపెట్టి నకిలీ బంగారం బిస్కట్లు విక్రయించిన ముగ్గురు వ్యక్తులను  పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సదరు వ్యాపారిని బంగారం బిస్కట్ల డీల్స్ నిర్వహించడానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయని పోలీసులు తెలిపారు. 'బంగారం బిస్కట్లు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వచ్చినప్పుడు సదరు ముగ్గురు వ్యక్తులు తమ వద్ద ఉన్న బిస్కట్లు ఇచ్చి వ్యాపారుల వద్ద ఉన్న మనీ లూటీ చేసేవారు` అని పాలమూ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రేష్మా రమేషన్ శనివారం మీడియాకు చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని జొర్కాట్ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ రేష్మా రమేషన్ వెల్లడించారు. నిందితుల ఉంచి మూడు కంట్రీ మేడ్ పిస్టళ్లు, మూడు లైవ్ క్యాట్రిడ్జ్‌లు, నకిలీ బంగారం బిస్కట్లు, ఇతర వస్తువులు జప్తు చేశామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)