నిలబడే మూడు ముళ్ల చేప !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ చేప చూడటానికి చాలా వింతగా ఉంది. ఈ చేప కడుపు కింద రెండు, వీపు పైన ఒక ముల్లు ఉన్నాయి. కడుపు కింద బోర్లించిన 'వి' ఆకారంలో ఉన్న ముళ్లపై చేప నిలబడి ఉంది. దీనికి ప్రత్యేకంగా మూడు ముళ్లు ఉండటంతో దీన్ని మూడు ముళ్ల చేప అని అంటున్నారు. అయితే, అత్యంత అరుదుగా కనిపించే ఈ చేపలను బవిరి చేపలు అంటారని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పీ శ్రీనివాసరావు చెప్పారు. సముద్ర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ బవిరి చేపలు అత్యంత అరుదుగా పైకి వస్తాయని ఆయన తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చలికాలంలో పైకి వచ్చే క్రమంలో ఇలా వలలకు చిక్కుతాయని ఆయన వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)