భింద్రన్‌వాలే మేనల్లుడు మృతి

Telugu Lo Computer
0


ర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే మేనల్లుడు, ఖలిస్థాన్‌ ఉగ్రవాది లఖ్‌బీర్‌ సింగ్‌ రోడే డిసెంబర్‌ 2న పాకిస్థాన్‌లో మరణించారు. లఖ్‌బీర్‌ గుండెపోటుతో మరణించినట్లు నిఘా వర్గాలు మంగళవారం తెలిపాయి. భింద్రన్‌వాలే మరణించిన అనంతరం లఖ్‌బీర్‌ సింగ్‌ పాకిస్థాన్‌ పారిపోయాడు. నిషేధిత సంస్థ ఖలిస్తాన్‌ జిందాబాద్‌ ఫోర్స్‌ అధ్యక్షుడు అయిన లఖ్‌బీర్‌ సింగ్‌ భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గనడంతో భారత ప్రభుత్వం అతనిని గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. లఖ్‌బీర్‌ మరణాన్ని భారత్‌లో ఉంటున్న అతడి సోదరుడు జస్‌బీర్‌ సింగ్‌ ధ్రువీకరించాడు. కెనడాలో ఉంటున్న లఖ్‌బీర్‌ కుమారుడి నుండి తనకు ఈ సమాచారం అందిందని పేర్కొన్నాడు. పాక్‌లోనే అతడి అంత్యక్రియలను పూర్తిచేసినట్లు వెల్లడించాడు. లఖ్‌బీర్‌ సింగ్‌ పంజాబ్‌కు డ్రగ్స్‌, ఆయుధాలు, పేలుడు పదార్థాలు పంపుతున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని పలువురు ప్రముఖ వ్యక్తులను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నాయి. 20 కేజీల ఆర్‌డిఎక్స్‌ పేలుడు పదార్థాలను కలిగి ఉన్న లఖ్‌భీర్‌ను నేపాల్‌లో అరెస్ట్‌ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అక్టోబర్‌లో పంజబాబ్‌లోని మోగాలో లఖ్‌బీర్‌ ఆస్తులను జప్తు చేసింది. 2021 మరియు 2023 మధ్య ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గన్నందుకు లఖ్‌బీర్‌పై ఆరు ఉగ్రవాద కేసులకు సంబంధించి ఈ దాడులు జరిపినట్లు ఎన్‌ఐఎ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)