నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌మార్కెట్‌లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 21,731 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 170 పాయింట్లు దిగజారి 72,240 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 సూచీలో టాటా మోటార్స్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, ఎంఅండ్ఎం, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నష్టాల్లో ముగిశాయి. భారీ బ్లాక్ డీల్ తర్వాత ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు 3 శాతం పెరిగాయి. సింగిల్ బ్లాక్ డీల్‌లో దాదాపు 1.65 మిలియన్ షేర్లు చేతులు మారాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)