ఈవీ స్కూటర్‌లో బ్యాటరీ - అవగాహన !

Telugu Lo Computer
0


మెరికా, చైనా తర్వాత మన దేశమే ఈవీ వాహనాల్లో అమ్మకాల పరంగా ముందు ఉంది. అయితే మన దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఫోర్‌ వీలర్స్‌తో పోల్చుకుంటే టూ వీలర్‌ ఈవీలే ఎక్కువుగా అమ్ముడుపోయాయి. వీటిల్లో కూడా ఈవీ స్కూటర్లే ఎక్కువగా అమ్ముడయ్యాయి. అయినా కూడా భారతదేశంలో ఈవీ వాహనాల్లో బ్యాటరీ పని తీరుపైనే అనుమానంతో చాలా మంది ఈవీలను కొనుగోలు చేయడం లేదు. అయితే నిపుణులు మాత్రం బ్యాటరీలను సరిగ్గా నిర్వహిస్తే ఈవీ వాహనాలకు అడ్డే ఉండదని అంటున్నారు.  ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే బ్యాటరీలు ఎన్నో ఏళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసే విధంగా తయారు చేస్తారు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీలు లిథియం అయాన్‌ను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది వాటి జీవితకాలాన్ని పెంచుతుంది. టూ వీలర్లలో బ్యాటరీ లైఫ్ కూడా ఐదేళ్ల కంటే ఎక్కువని నిపుణులు వివరిస్తున్నారు. దేశంలో లభించే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో అనేక రకాల పరీక్షల తర్వాత బ్యాటరీని అమరుస్తారు. దీనితో పాటు బ్యాటరీపై వారెంటీని కూడా కంపెనీలు ఇస్తాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై వారెంటీ ఐదు నుంచి ఏడు సంవత్సరాలు లేదా 60 నుంచి 80 వేల కిలోమీటర్ల వరకు ఇస్తారు. కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత బ్యాటరీని ఛార్జ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అయితే వాడే కొద్దీ బ్యాటరీ లైఫ్ తగ్గడంతో ఛార్జింగ్ సమయం పెరగడం ప్రారంభమవుతుంది. అదే విధంగా కొత్త బ్యాటరీ ఛార్జ్ చేసిన తర్వాత త్వరగా డ్రెయిన్ అవ్వదు. దీని పరిధి కూడా చాలా ఎక్కువ. కానీ బ్యాటరీ చెడిపోవడం ప్రారంభించినప్పుడు తక్కువ ఉపయోగించినప్పటికీ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. ఇది వాహన మైలేజ్‌ను కూడా తగ్గిస్తుంది. వాతావరణం వల్ల బ్యాటరీ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. దేశంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యం ప్రభావితం కావచ్చు. బ్యాటరీని ఎప్పుడూ ఓవర్‌ఛార్జ్ చేయకూడదు. దాదాపు అన్ని కంపెనీలు వాహనాన్ని ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే సమాచారాన్ని అందిస్తాయి. అలాంటి పరిస్థితిలో ఓవర్ ఛార్జింగ్‌ను నివారిస్తే బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)