బీస్ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌!

Telugu Lo Computer
0


భారత అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ వీడియోను రైల్వే తమ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దాన్ని 'బీస్ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌'గా అభివర్ణించింది. రైల్వే శాఖ తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన 'వాగ్‌12బీ' ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ ఇది. తాజాగా పోస్ట్‌ చేసిన వీడియోలో అత్యంత శక్తిమంతమైన ఈ రైలు ఇంజిన్‌ డబుల్‌ డెక్కర్‌ను తలపించేలా కార్గో బోగీలను తీసుకెళ్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 12,000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు దేశంలోని అత్యంత శక్తివంతమైన స్వదేశీ లోకోమోటివ్‌లు. మేక్‌ ఇన్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా వీటిని అభివృద్ధి చేశారు. ఇవి గరిష్ఠంగా గంటకు 120కి.మీల వేగంతో 6 వేల టన్నుల బరువు వరకు లాక్కెళ్లగలవు. అంతకుముందు తీసుకొచ్చిన వాగ్‌-9 లోకోమోటివ్‌లతో పోలిస్తే వీటి సామర్థ్యం రెండింతలు ఎక్కువని రైల్వే శాఖ గతంలో వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)