మిచౌంగ్ తుపానుకు చెన్నై కాకావికలం !

Telugu Lo Computer
0


మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై కాకావికలమైతోంది. భారీ వర్షాలకు చెన్నైలో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రభావంతో కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. వర్షాల ప్రభావంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చెన్నై నగరంలో భారీ వార్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపో​యాయి. రోడ్లపై మోకాలు వరకు నీరు చేరుకుంది. దీంతో రోడ్లపై రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెంగల్పట్టు సమీపంలోని సముద్రతీర ప్రాంతం నుంచి వేగవంతమైన గాలులు వీస్తున్నాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. చెంగల్పట్టులోని పలు ప్రాంతాలపై భారీ వర్షం, సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు కాలువలా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నిలిచి ఉన్న కార్లు వాన నీటిలో కొట్టుకుపోతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)